ఇంతలోనే ఇసుక అక్రమ రవాణా..

నవతెలంగాణ – ఆళ్ళపల్లి 
ఆళ్ళపల్లి మండలంలోని రాయిపాడు, ముత్తాపురం గ్రామాల్లో గత తుఫాన్ నేపథ్యంలో అధిక వర్షాలకు కిన్నెరసాని వాగు వరద ప్రవాహం మిగిల్చిన విషాదం ఛాయలను ( ఒక మనిషి గల్లంతు, 6 ఇండ్లు నేలమట్టం, 12 ఇండ్లు నీట మునిగి, రహదారి కోతకు గురికావడం జరిగింది) మరువక ముందే రాయిపాడు గ్రామ పంచాయితీ పరిధిలో ఆదివారం వేకువజామున గుర్తు తెలియని వ్యక్తులు ఇసుక దందాకు తెరలేపారని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో ఆళ్ళపల్లి మండలంలో కిన్నెరసాని నది పరివాహక ప్రాంతంలో ఇసుక దిబ్బలను ప్రభుత్వ అనుమతులతో, స్థానిక అధికారుల కనులుగప్పి అక్రమంగా తవ్వి, ఇతర మండలాలకు, జిల్లాలకు తీసుకెళ్లడంతో నేడు అధిక వర్షాల కారణంగా మండలంలో జిల్లా కేంద్రానికి వెళ్ళే ప్రధాన రహదారి కోతకు గురి అయింది. ఆ రహదారిని ముక్కి ములిగి ప్రజా ప్రతినిధులు, అధికారులు మరమత్తులు చేయడమే ఆలస్యం గుర్తు తెలియని టిప్పర్లలో తెల్లవారు జామున రాయిపాడు గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపేసి మరీ సమీప కిన్నెరసాని బ్రిడ్జి పక్కలో ఉన్న ఇసుకను రెండు టిప్పర్లలో అనుమతులు లేకుండా తరలించారని స్థానిక వాసులు అంటున్నారు. ఎవరని అడగడానికి వెళ్తున్న గ్రామస్తులను చూసి లారీలు పారిపోయారని చెబుతున్నారు. ఎక్కడి టిప్పర్లు, ఎవరికి చెందినవనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Spread the love