నవతెలంగాణ – దుబ్బాక రూరల్
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని రాజక్కపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ మేరకు పుస్తకాలు పాఠశాలలోని విద్యార్థులకు యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం తమ పాఠశాలకు ఫర్నీచర్, ప్రహరీ గోడ, కిచెన్ షెడ్డు, బాత్ రూమ్స్ కావాలని హెచ్ఎం సత్యనారాయణ రెడ్డి ఎంపీని కోరారు. ఎంపీ సానుకూలంగా స్పందించి మన ఊరు మనబడి సెకండ్ ఫేజ్ లో ఈపనులను చేయిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా చూడాలని సర్పంచ్, ఎంపీటీసీ, పాఠశాల హెచ్ఎం లకు ఎంపీ సూచించారు. కార్యక్రమంలో ఎంపీ వెంట జడ్పిటిసి కడతల రవీందర్ రెడ్డి,ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి, సర్పంచ్ పెరుగు పద్మ పర్వతాలు యాదవ్, ఎంపీటీసీ కోమటిరెడ్డి మమత రాధ మనోహర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బాణాల శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.