
నవతెలంగాణ – భువనగిరి రూరల్
సమ్మక్క- సారలమ్మ జాతరకు వెళ్ళే భక్తులు వీలైనంత వరకు మీ ఇంటిలో విలువైన వస్తువులు, నగదు, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను జాగ్రత్తగా భద్రపరచాలని, బ్యాంకులలో భద్రపరచుకోలేని భువనగిరి రూరల్ ఎస్సై సంతోష్ కుమార్ సూచించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇంటి నుండి బయట ప్రదేశాలకు వెళ్ళేటపుడు మీ చుట్టుపక్కల ఇంటి వారికి, స్థానిక పోలీస్ లకు సమాచారం ఇవ్వాలని, ఇంటి ముందు రూమ్ లో లైట్ ఆన్ చేసి వెళ్ళండి. ఇంటి ముందు చెప్పులు విడిచిపెట్టి ఉంచాలని, మీ ప్రాంతంలో అపరిచిత వ్యక్తులు సంచరించినా, నెంబర్ ప్లేట్ లేని వాహన దారులు, అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. రాత్రి పూట ఆరు బయట గానీ, డాబా పైన కానీ నిద్రించవద్దని, ఇంటి తాళం చెవి జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలని, బంగారు ఆభరణాలు మెడలో ధరించినపుడు జాగ్రత్త వహించాలని, బస్సుల్లో, ఆటోలో, రద్దీగా ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, దొంగతనాలు కాకుండా పోలీసులతో పాటు పౌరులుగా మీరు, మీ గ్రామంలోని యూత్ సభ్యులను రాత్రి గస్తిలో పోలీసులతో పాటు తిరిగి మీ గ్రామ శ్రేయస్సుకు భాధ్యత ఉందన్నారు. ఏ సమస్య ఎదురైనా వెంటనే పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్ 100 కి కాల్ చేయండి. లేదా భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ నెంబర్ 8712662733 కి లేదా భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ 871266 2472 కి ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు.