– తెలుగు తల్లి విగ్రహానికి పూజలు రోగులకు పండ్లు పంపిణీ
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వైద్య ఆరోగ్య దినోత్సవం కార్యక్రమాన్ని వైద్యులు వైద్య సిబ్బంది ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సురేష్ ఉపసర్పంచ్ విట్టల్ ఎంపిటిసి కుటుంబ సభ్యులు రచ్చ కుశాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపర్డెంట్ ఆనంద్ జాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తుందని రోగులకు కావలసిన సౌకర్యాలు కల్పిస్తుందని పేర్కొన్నారు ఆస్పత్రిలో చికిత్సలు పొందే రోగులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు వైద్య సిబ్బంది ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
.