హైదరాబాదులో గ్రామపంచాయతీ జేఏసీ రాష్ట్ర ముఖ్యుల సమావేశం

నవతెలంగాణ- జక్రాన్ పల్లి
హైదరాబాదులో గ్రామపంచాయతీ జేఏసీ రాష్ట్ర ముఖ్యుల సమావేశం ఎఐటియుసి ఆఫీసులో జేసీ చైర్మన్  భాస్కర్ అధ్యక్షతన 30 ఆగస్టు 2023న నిర్వహించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న జేఏసీ నాయకులు ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ సుల్తానీయాన్ని కలిసి వినతిపత్రాన్ని అందించారు .మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చర్చల సందర్భంగా ఇచ్చిన మాటను వెంటనే అమలు చేయాలని లేనిచో తిరిగి పంచాయతీ కార్మికుల ఆందోళన ప్రారంభమవుతుందని వారు తెలిపారు. జెఎసి రాష్ట్ర సలహాదారు ఈసుఫ్, రాష్ట్ర కన్వీనర్ దాసు, వెంకట్రాజ్యం అరుణ్ ,శివ బాబు,  జటంకి వెంకన్న, సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నిజాంబాద్ జిల్లా నుండి సవిన్, బండి సాయన్న, గుర్రపు రాజేశ్వర్, అజీమ్ శ్రీపాద బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.
Spread the love