అమెరికాలో మెస్సి మేనియా : మేజర్ లీగ్ సాకర్ (ఎంఎల్‌ఎస్)లో ప్రపంచ ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ లియోనల్ మెస్సి శకం మొదలైంది. ఫ్లోరిడాలో జరిగిన ఓ కార్యక్రమంలో లియోనల్ మెస్సిని ఇంటర్ మియామీ క్లబ్ అధికారికంగా అభిమానులకు పరిచయం చేసింది. 2025 వరకు ఇంటర్ మియామితో మెస్సి బంధం కొనసాగనుంది.