బిల్లులు రాక బిక్షమెత్తిన మధ్యాహ్న భోజన కార్మికులు

నవతెలంగాణ -కంటేశ్వర్
తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సిఐటియు) రాష్ట్ర వ్యాప్త టోకెన్ సమ్మె రెండవ రోజులో భాగంగా రెంజల్ మండల కేంద్రంలో ఎంఈఓ కార్యాలయం నుండి ఎండిఓ కార్యాలయం వరకు భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది.ఈ సందర్భంగా తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ గత తొమ్మిది నెలలుగా బిల్లులు రాకపోవడంతో మధ్యాహ్న భోజన నిర్వాహకులు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశామని అన్నారు, ముఖ్యమంత్రి గారు ప్రకటించిన మూడు వేల రూపాయల గౌరవ వేతనం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రేపు జరిగే చలో కలెక్టరేట్ కార్యక్రమానికి మధ్యాహ్న భోజన కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు చామంతి లక్ష్మి మండల నాయకులు శిరీష, సు మీద, సావిత్రి, గంగామణి అశోక్, స్వరూప, నరస గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love