పాల డెయిరీ ‘కంట్రీ డిలైట్‌’ మోసం బట్టబయలు..

నవతెలంగాణ – హైదరాబాద్: కంట్రీ డిలైట్ కంత్రి మాయా వెలుగులోకి వచ్చింది. అనుమతులు లేకుండానే తెలంగాణ రాష్ట్రంలోనే నెయ్యి, ఇతర ఉత్పత్తుల అమ్మకాలు జరుపుతోంది. కంట్రీ డిలైట్‌.  కోట్లలో వ్యాపారం చేస్తున్న కంట్రీ డిలైట్‌ ఆట కట్టించింది. తెలంగాణ ఫుడ్ ఇన్స్పెక్టర్స్. సంగారెడ్డి లోని ప్లాంట్ లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ  క్రమంలోనే తెలంగాణలో అనుమతులు తీసుకోలేదని వెల్లడించారు. 52 లక్షల విలువ చేసే1500 లీటర్ల నెయ్యి సీజ్ చేశారు. తెలంగాణ ఆహార నాణ్యత ప్రమాణాల విభాగం కంట్రీ డిలైట్ కు నోటీసులు జారీ చేసింది. నిల్వ చేసిన నెయ్యిని వినియోగదారులకు అందిస్తు ఫార్మ్ టు హోమ్ అంటూ కంట్రీ డిలైట్ తప్పుడు ప్రచారం చేస్తోందని అధికారులు గుర్తించారు. మిస్ బ్రాండింగ్ చేస్తూ అడ్డంగా దొరికిన కంట్రీ డిలైట్ కు అధికారులు నోటీసులు జారీ చేశారు.

Spread the love