కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి

Minimum wages should be implemented for workers– ఓకేజి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ స్టాఫ్‌ అండ్‌ డ్రైవర్స్‌ యూనియన్‌ అసోసియేషన్‌ నాయకులు
నవతెలంగాణ-మియాపూర్‌
గచ్చిబౌలి ఓకేజ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ యాజమాన్యం కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని ఆ సంఘం నాయకులు కొంగరి కృష్ణ, కుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ విషయంపై రెండ్రోజుల క్రితం స్థానిక ఎంఈఓను కలిసి వినతి పత్రాన్ని అందజేసినట్టు తెలిపారు. ఎంఈఓకు వినతి పత్రం ఇచ్చిన అనంతరం కార్మికులపై యాజమాన్యం ఇంకా ఎక్కువగా వేధింపులు చేస్తుందని ఆరోపించారు. కనీస వేతనాలు అమలు చేయకపోగా బస్సు డ్రైవర్సు, క్లీనర్స్‌ ఇతర స్టాప్‌కు ఏ మాత్రం కనీస సౌకర్యాలు కల్పించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విభాగాలు కార్మికుల పట్ల స్కూల్‌ యాజమాన్యం వివరిస్తున్న తీరుపై స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Spread the love