– యశోద ఆస్పత్రిలో చికిత్స..కవిత పరామర్శ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకున్న ఆయన గొంతునొప్పితో తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. దీంతో ఆయన యశోద ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఎన్నికల సమయంలోనూ ఆయన తీవ్ర గొంతు నొప్పికి గురయిన విషయం తెలిసిందే. ఆయనకు పెద్దగా ప్రమాదమేమీ లేదని ఆస్పత్రి వైద్యులు చెప్పారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.