ప్రజల కోసం ప్రయోగించిన బ్రహ్మాస్త్రం ధరణి : మంత్రి కేటీఆర్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
శరవేగంగా పరుగులు పెడుతున్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఆధునిక సంస్కరణలే పునాదిరాళ్లు అని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. టీఎస్‌ఐపాస్‌ విధానంతో పెట్టు బడులకు రాష్ట్రం స్వర్గధామమైందని కొనియా డారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ”భూమి చుట్టూ అల్లుకున్న సవాలక్ష చిక్కుముళ్లను విప్పేందుకు ప్రజల కోసం ప్రయోగించిన బ్రహ్మాస్త్రం ధరణి పోర్టల్‌. జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ నుంచి నూతన కలెక్టరేట్ల నిర్మాణం వరకు.. తండాలు, గ్రామ పంచాయతీల నుంచి నూతన రెవెన్యూ డివిజన్లు, మండలాలు, మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్ల వరకూ తెలంగాణలో తీసుకొచ్చిన ప్రతి సంస్కరణ భవిష్యత్‌ తరాలకు వెలకట్టలేనిది” అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Spread the love