అభివృద్ధి సభా వేదికపై మంత్రి కేటీఆర్ వివరించడం సంతోషకరము

– నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్తా
నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ నగర అభివృద్ధిపై టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర ఐటీ పురపాలక పరిశ్రమల శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు ఇచ్చిన కితాబు నన్ను ఎంతో ఆనందానికి గురిచేసింది 9 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి విషయాన్ని సభా వేదికపై మంత్రి కేటీఆర్  వివరించడం సంతోషాన్ని కలిగిస్తోంది వాస్తవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ కవిత  మార్గదర్శకంలో వారి సహాయ సహకారాలతో నిజామాబాద్ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాను ఇందులో విజయవంతంగా అభివృద్ధి కార్యక్రమాలు జరగడం అందుకు తగ్గ ఫలితాలు రావడం ఎనలేని తృప్తిని అందిస్తోంది
నిజామాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ కార్పొరేషన్ కు 60 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిన రాష్ట్ర పురపాలక మంత్రి కేటీఆర్ కి నగర ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బెస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ బెస్ట్ వైకుంఠ ధామాలు అని స్వయంగా కేటీఆర్ వివరించడం మరింత స్ఫూర్తిని అందించింది వచ్చే ఎన్నికల్లో 55 వేల ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించాలని స్వయంగా కేటీఆర్ గారు ఆకాంక్షిస్తూ ప్రజలను కోరడం నన్ను ఎంతగానో ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని అందించింది మరింత బాధ్యతను పెంచింది ప్రజల సేవలో నిత్యం తరించేందుకు ఇంకా ఎక్కువగా పని చేసేందుకు కేటీఆర్  మాటలు నాకు కొండంత మద్దతును తెలియజేశాయి. కేటీఆర్ కు ఎల్లవేళలా నిబద్ధుడిగా ఉంటూ, పార్టీ కోసం, ప్రజల కోసం నిత్యం పనిచేయడానికి ముందుంటానని తెలియజేస్తూ నిన్నటి కార్యక్రమాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
Spread the love