సమగ్ర కుల గణన తీర్మానం ప్రవేశ పెట్టిన మంత్రి పొన్నం

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
తెలంగాణ మంత్రి వర్గం ఈ నెల 4 న తీసుకున్న నిర్ణయం మేరకు శుక్రవారం అసెంబ్లీలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రభాకర్ సమగ్ర కుల గణన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వెనుకబడిన తరగతుల ,షెడ్యూల్ కులాల , షెడ్యూల్ తెగల, మిగతా బలహీన వర్గాల కి చెందిన ప్రజల అభ్యున్నతి కోసం వివిధ సామజిక, ఆర్థిక , విద్యా పరమైన ,ఉపాధి ,రాజకీయ అవకాశాలు ప్రణాళికలు రూపోందించెలా అమలు పరిచేలా ఇంటింటి కుల గణన కుటుంబ సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పేర్కొన్నారు. కుల గణన పై పలు సార్లు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రస్తావన చేశారని గుర్తుచేశారు. అందుకు అనుగుణంగా అందరి సంక్షేమానికి సంబంధించి ఉపయోగపడే విధంగా సమాచారాన్ని తీసుకొని ముందుకు పోతామన్నారు. ముఖ్యమంత్రి ,ఉప ముఖ్యమంత్రి, మిత్రులందరి మంత్రి వర్గ తీర్మానం నుండి తీసుకున్నామన్నారు. జనాభా కుల గణన అనేది కేంద్ర ప్రభుత్వ పరిధి లో అయినప్పటికి రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు దృష్ట్యా కుల గణన చేపడుతున్నాట్లు పేర్కొన్నారు. ఈ సర్వే ద్వారా రాష్ట్రం లో ఎస్సి ఎస్టీ బీసీ  ఇతర బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. సమగ్ర కుల గణన ప్రవేశపెట్టినందుకు అవకాశం ఇచ్చిన సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి కి  ధన్యవాదాలు తెలిపారు.
Spread the love