చేజారిన నం.1 ర్యాంక్‌!

– అగ్రస్థానంలోకి ఆస్ట్రేలియా
దుబాయ్: ఐసీసీ వార్షిక టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం ఆస్ట్రేలియా వశమైంది. నం.1 స్థానంలో కొనసాగిన భారత్‌.. రెండో స్థానానికి పడి పోయింది. 124 పాయింట్లతో ఆసీస్‌, 118 పాయింట్లతో భారత్‌ టాప్‌-2 స్థానాల్లో నిలిచాయి. ఈ ర్యాంకింగ్స్‌కు మే 2021 తర్వాత జరిగిన మ్యాచులనే పరిగణనలోకి తీసుకున్నారు. దీంతో ఆసీస్‌లో భారత్‌ 2-1 టెస్టు సిరీస్‌ విజయం లెక్కలోకి రాలేదు. ఫలితంగా, తాజాగా ఎటువంటి మ్యాచులు లేకపోయినా ఆస్ట్రేలియా వరల్డ్‌ నం.1గా అవతరించింది. వైట్‌బాల్‌ ఫార్మాట్‌లో భారత్‌ వరల్డ్‌ నం.1గా కొనసాగుతుంది. వన్డేల్లో భారత్‌ (122), ఆస్ట్రేలియా (116) టాప్‌-2లో నిలువగా.. టీ20 ర్యాంకింగ్స్‌లోనూ భారత్‌ (264), ఆస్ట్రేలియా (257) తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.

Spread the love