భారత్‌లో సఫారీ టూర్‌

భారత్‌లో సఫారీ టూర్‌– వన్డే, టీ20, టెస్టు సిరీస్‌కు భారత్‌ ఆతిథ్యం
ముంబయి : భారత మహిళల జట్టు మరో టెస్టు మ్యాచ్‌ సమరానికి సిద్ధం కానుంది. రెడ్‌ బాల్‌ ఫార్మాట్‌ను ప్రోత్సహించేందుకు భారత క్రికెట్‌ బోర్డు సానుకూలంగా ఉండటంతో చెన్నై చెపాక్‌ స్టేడియంలో భారత్‌, దక్షిణాఫ్రికా అమ్మాయిలు టెస్టు మ్యాచ్‌లో తలపడనున్నారు. మూడు వన్డేలు, మూడు టీ20లు సహా ఓ టెస్టు మ్యాచ్‌ కోసం దక్షిణాఫ్రికా అమ్మాయిల జట్టు జూన్‌లో భారత పర్యటనకు రానున్నారు. జూన్‌ 16న తొలి వన్డే జరుగనుండగా.. 19, 23న చివరి రెండు వన్డేలు షెడ్యూల్‌ చేశారు. జులై 5, 7, 9న టీ20 మ్యాచులు జరుగుతాయి. ఆరు వైట్‌బాల్‌ ఫార్మాట్‌ మ్యాచులకు బెంగళూర్‌ చిన్నస్వామి స్టేడియం వేదిక కానున్నట్టు సమాచారం. జూన్‌ 28 నుంచి ఏకైక టెస్టు ఆరంభం కానుండగా.. చెన్నై చెపాక్‌ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. గత ఏడు నెలల్లో టీమ్‌ ఇండియా అమ్మాయిలు ఆడనున్న మూడో టెస్టు కావటం గమనార్హం. 2023 డిసెంబర్‌లో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాపై టీమ్‌ ఇండియా చారిత్రక టెస్టు విజయాలు సాధించిన సంగతి తెలిసిందే.

Spread the love