పక్షపాత రాజకీయ ప్రసంగం కోసం వాడుకుంటారా? :
ప్రధాని మోడీపై ఈసీకి సీపీఐ(ఎం) ఫిర్యాదు
న్యూఢిల్లీ : మరికొన్ని రోజుల్లో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమల్లో ఉన్న సమయం లో ఈ నెల 18న తన పక్షపాత రాజకీయ ప్రసంగం కోసం ప్రభుత్వ ప్రసార సంస్థ దూరదర్శన్‌ను ప్రధాని మోడీ దుర్వినియోగం చేయడం ఎంసీసీని ఉల్లంఘించడమేనని సీపీఐ(ఎం) స్పష్టం చేసింది. ఈ ఉల్లంఘనకు గాను ప్రధానమంత్రి, ఇతరులపై చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల సంఘానికి సీపీఐ(ఎం) ఫిర్యాదు చేసింది. ఈ మేరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ)కు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ లేఖ రాశారు. ఈ ఉల్లంఘనను తీవ్రంగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. లేఖలోని వివరాల ప్రకారం…. రాజకీయ ప్రసంగం చేయడానికి ప్రభుత్వ ప్రసార సంస్థ దూరదర్శన్‌ను దుర్వినియోగం చేయడం ద్వారా ప్రధాని మోడీ ఎంసీసీని తీవ్రంగా ఉల్లంఘించిన విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తక్షణమే తీసుకువస్తున్నట్టు తెలిపారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ శాసనసభలకు త్వరలో జరగబోయే ఎన్నికల దృష్ట్యా ఎంసీసీ అమలులో ఉందని, అయినప్పటికీ, ప్రధానమంత్రి ఈ నెల 18న జాతిని ఉద్దేశించి ప్రసంగించారని బేబీ గుర్తు చేశారు. ఆ ప్రసంగంలోని విషయం, ధోరణి, జాతికి ఇ్చచ్చిన సందేశాన్ని ఏ విధంగానూ ప్రభుత్వ ప్రసంగంగా పరిగణించలేమని, అది పూర్తిగా రాజకీయమైనదని పేర్కొన్నారు. ప్రధాని మోడీ తన ప్రసంగంలో ప్రతిపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకుని, అనేక పార్టీల పేర్లను ప్రస్తావిస్తూ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఓటర్లతో సహా ప్రజల అభిప్రాయాన్ని అధికార పార్టీకి అనుకూలంగా ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని వివరించారు. మోడీ ఈ విధంగా చేయడం ఎంసీసీలోని సెక్షన్ 4లో ”అధికారంలో ఉన్న పార్టీ” అనే శీర్షిక కింద పేర్కొన్న నిబంధనను స్పష్టంగా ఉల్లంఘించడమేనని ఎంఏ బేబీ పేర్కొన్నారు. ఆ నిబంధన ప్రకారం ”ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న పార్టీ అవకాశాల ను మెరుగుపరిచే ఉద్దేశంతో, ప్రజా ధనాన్ని ఖర్చుపెట్టి వార్తాపత్రికలు, ఇతర మాధ్యమాలలో ప్రకటనలు జారీ చేయడం, రాజకీయ వార్తలకు పక్షపాత కవరేజీ ఇవ్వడం, పార్టీ విజయాల గురించి ప్రచారం చేయడం కోసం ప్రభుత్వ ప్రసార మాధ్యమాలను దుర్వినియోగం చేయడం వంటివాటిని కచ్చితంగా నివారించాలని” ఉంది. పదవిలో ఉన్న ప్రధాని ఎన్నికల సమయంలో రాజకీయ సందేశాల కోసం ప్రభుత్వ ప్రసార సంస్థను ఒక వేదికగా ఉపయోగించడం అనేది అసమాన పోటీ వాతావరణాన్ని సృష్టించి, మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభ మైన స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల సూత్రాన్ని దెబ్బతీస్తుందని బేబీ పేర్కొన్నారు. కాబ ట్టి ప్రస్తుత పరిస్థితులలో ఈ ఉల్లంఘనను సుమోటోగా స్వీకరించి, ప్రధానమంత్రి, సంబంధి త అధికారు లపై తక్షణమే తగిన చర్యలు ప్రారంభించాలని ఎలక్షన్ కమిషన్‌కు ఎంఏ బేబీ విజ్ఞప్తి చేశారు.
దూరదర్శన్ దుర్వినియోగం
- Advertisement -
- Advertisement -



