స్వర్గీయ ఉపాధ్యాయుని జ్ఞాపకార్థం మిత్రబృందం సేవా కార్యక్రమాలు

– గోశాల ఆవులకు దాన సంరక్షణ కోసం నగదు అందజేత
నవతెలంగాణ –  మద్నూర్
మద్నూర్ మండల కేంద్రానికి చెందిన స్వర్గీయ దెబ్బడు వార్ పవన్ కుమార్ ఉపాధ్యాయుని జ్ఞాపకార్థం ఆయన తోటి మిత్రుల బృందం శుక్రవారం నాడు మండల కేంద్రంలోని గోశాల సందర్శించి అక్కడ ఆవులకు దాన అందజేశారు. గోశాల ఆవుల సంరక్షణ కోసం స్వర్గీయ ఉపాధ్యాయుని మిత్రబృందం నగదును గోశాల నిర్వాహకులు చాట్ లో హనుమాన్లు కు అందజేశారు. ఈ సేవా  కార్యక్రమాలు నిర్వహించిన వారిలో రఘు బాలు సంతోష్ గంగాధర్ తాజా మాజీ ఉపసర్పంచ్ విట్టల్ తో పాటు తదితర మిత్రులతో పాటు చిన్నారులు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Spread the love