కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే అరూరి

నవతెలంగాణ-పర్వతగిరి
మండలంలోని చౌటపల్లి సొసైటీ పరిధి లోని కొంకపాక గ్రామంలో గురు వారం బీఅర్‌ఎస్‌ వరంగల్‌ జిల్లా అధ్యక్షులు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ఎలాంటి అవకతవకలు లేకుండా కొను గోళ్లు చేయాలని అధికారులు,సిబ్బందికి సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలను పరామర్శ
మండలంలోని కొంకపాక గ్రామానికి చెందిన వార్డు సభ్యులు మాదాసి రమేష్‌ తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా గురువారం ఎమ్మెల్యే ఆరూరి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం అదే గ్రామానికి చెందిన వర్కాల కనుకయ్య అనారోగ్యం మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక స హాయం చేశారు. ఎమ్మెల్యే వెంట ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు ఉన్నారు.

Spread the love