మున్నూరు కాపు భవన నిర్మాణానికి కృషి : ఎమ్మెల్యే గాంధీ

నవతెలంగాణ-శేరిలింగంపల్లి
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్‌ డివిజన్‌ పరిధిలోని మార్తాండ్‌ నగర్‌ కాలనీలో హఫీజ్‌పేట్‌ మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణానికి రూ.21లక్షలు అంచనా వ్యయంతో ఎమ్మెల్యే సీడీపీ నిధులతో నిర్మించేందుకు నిధులు మంజూరు కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు మంజూరి పత్రాలను మున్నూరు కాపు సంక్షేమ సంఘం సభ్యులకు ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అందజేశారు. మంగళవారం ఈ సందర్భంగా ఎమ్మెలే గాంధీ మాట్లాడుతూ కొండాపూర్‌ డివిజన్‌ సమగ్ర అభివృద్ధిలో భాగంగా మున్నూరు కాపు సంఘం సభ్యుల విజ్ఞప్తి మేరకు హఫీజ్‌పేట్‌ మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణానికి ఎమ్మెల్యే సీడీపీ ఫండ్స్‌ ద్వారా రూ.21లక్షలు ఎమ్మెల్యే జీడీపీ ఫండ్స్‌ నుంచి మంజూరు చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపినట్టు వెల్ల డించారు. నిధులు మంజూరైన వెంటనే భవన నిర్మాణం త్వరతగతిన చేపట్టి, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. చిన్న చిన్న సమావేశాలు, సభలు, ఫంక్షన్‌లు నిర్వహించుకునేందుకు వీలుగా కమ్యూనిటీ హాల్‌ ను నిర్మించేందుకు సంతోషంగా ఉంద న్నారు. కొండాపూర్‌ డివిజన్‌ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామన్నారు. ఈ సందర్బంగా హపీజ్‌పేట్‌ మున్నూరు కాపు సంఘం సభ్యులు మాట్లాడుతూ తాము అడిగిన వెంటనే భవనం నిర్మాణానికి సహాకరించిన ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి కాలనీ వాసుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హఫీజ్పెట్‌ మున్నూరు కాపు సంఘం సభ్యులు చైర్మన్‌ కొన్నవేణి రమేష్‌, ప్రెసిడెంట్‌ పొగుల సత్యనారాయణ, జనరల్‌ సెక్రటరీ వాసాల శ్రీనివాస్‌, పేరుక రమేష్‌, బుడుగు తిరుపతి రెడ్డి, గాజుల మహేందర్‌,బొల్లం సంతోష్‌, బత్తుల సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love