జర్నలిస్టుల పాత్ర మరువలేనిది: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

నవతెలంగాణ – మాక్లూర్
తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని బొర్గం (కే) గ్రామ శివారులో జర్నలిస్టుల కోసం ప్రెస్ భవన్, కమ్యూనిటీ హాల్ కు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టుల సొంతింటి కల సాకారం చేసేందుకు తమ ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. ఇళ్ల స్థలాలతో పాటు విద్యా, వైద్యం వంటి రంగాల్లో జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.  50 లక్షల నిధులతో భవన నిర్మాణం చేపట్టనున్నామన్నారు. తెలంగాణలోనే ఎక్కడా లేని విధంగా ఈ కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని తెలిపారు. తెలంగాణ పోరాట స్ఫూర్తిని రగిల్చిన జర్నలిస్టులను గుర్తించడంలో కొంత ఆలస్య మైందని ఆయన అన్నారు. సమాజ శ్రేయస్సు కోసం శ్రమిస్తున్న మీడియా ప్రతినిధులకు అన్నివిధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ విఠల్ రావు, ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు శేఖర్, రాజలింగం, సీనియర్ జర్నలిస్టులు గణేష్, నర్సింహచారి, గంగదాస్, ప్రమోద్ గౌడ్, గోవింద్, రాజు, నర్సింలు, సంజీవ్, పరమేష్, శ్రీకాంత్, రాజేష్, రజనీకాంత్, శ్రీనివాస్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

Spread the love