మన రాష్ట్ర సరిహద్దు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఎంపీగా ఉన్న వసంతరావు చౌహన్ ఇటీవల ఆకస్మికంగా మృతి చెందడం జరిగింది. ఆయన మృతికి సంతాప సూచికంగా మన జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు బుధవారం రాత్రి మృతి చెందిన ఎంపీ సొంత గ్రామమైన నాయగావ్ గ్రామాన్ని సందర్శించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ.. ఎంపీ చిత్రపటానికి పూలమాల లేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మృతి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటుగా ఎమ్మెల్యే కొనియాడారు. ఎమ్మెల్యే వెంటా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడు సాయి పటేల్, హనుమాన్ స్వామి, రామ్ పటేల్, వట్నాల రమేష్, నాగేష్ పటేల్, అమూల్, తదితరులు పాల్గొన్నారు.