బాలుడి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే సీతక్క

నవతెలంగాణ- గోవిందరావుపేట
గత కొద్దిరోజుల క్రితం మండలంలోని గాంధీనగర్ గ్రామంలో ఈతకు వెళ్లి మృతి చెందిన మాలోత్ చందు వర్ష ల కుమారుడు రాహుల్ కుటుంబాన్ని గురువారం ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. రాహుల్ మృతి కుటుంబానికి తీరని లోటని అన్నారు. చందు కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉండి ఆదుకుంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గోవిందరావుపేట మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ, సహకార సంఘ అధ్యక్షులు పన్నాల ఎల్లారెడ్డి, మండల ఇంఛార్జి కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, జెట్టి సోమయ్య, ఎంపీటీసీ గోపిదాసు ఏడుకొండలు, సర్పంచ్ భూక్య సుక్య, ఉపసర్పంచ్ బద్దం లింగారెడ్డి, కాడబోయిన రవి, బర్ల సమ్మిరెడ్డి, తండా రవి, జంపాల చంద్రశేఖర్, జక్కు రణదీప్, మిరియాల యాదగిరి రెడ్డి, సామ సమ్మిరెడ్డి, గాజుల నారాయణ, భూక్యా జీన, బానోత్ లాలు, లావుడియ హరి, గుగులోత్ కిషన్, గుగులోతు జయరామ్, తేజవత్ టాక్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love