- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
ఈ నెల 6న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పుట్టిన రోజు నియోజకవర్గం వ్యాప్తంగా ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే తోటకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. మీరు పంపిన శుభాకాంక్షలు, పుష్పగుచ్చం పట్ల నాకు ఎంతో సంతోషం కలిగిందన్నారు. మీ నాయకత్వంలో మా నియోజక వర్గ అభివృద్ధి కోసం, ప్రజా సేవలో నిరంతంర శ్రమిస్తానని అన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డికి ధన్యావాదాలు తెలిపారు.
- Advertisement -



