నవతెలంగాణ కమ్మర్ పల్లి: బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శుక్రవారం మండల కేంద్రంలో పర్యటిస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12గంటలకు స్థానిక కమ్మర్ పల్లి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్లబ్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి షటిల్ టోర్నమెంట్ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రశాంత్ రెడ్డి పాల్గొంటున్నట్లు తెలిపారు.ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.