ఉచిత మెగా వైద్య శిబిరం ను ప్రారంభించిన ఎమ్మెల్యే..

నవతెలంగాణ – భువనగిరి రూరల్
భువనగిరి మండలంలోని ముస్తాలపల్లి గ్రామంలో ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన శ్రీ ఆర్ కె హాస్పిటల్ , చావా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించగా, వైద్య శిబిరాన్ని భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి భువనగిరి ఎంపీపీ నారాల నిర్మల వెంకటస్వామి యాదవ్, జడ్పిటిసి సుబ్బురు బీరు మల్లయ్య తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లెల్లో వైద్యం సేవలు ఉచితంగా అందించడం గొప్ప విషయం అన్నారు. సీఎం కేసీఆర్ ఆరోగ్య తెలంగాణ కోసం పనిచేస్తున్నారనారు. ఈ సందర్భంగా ఆర్ కే హాస్పిటల్ అధినేత డాక్టర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లెకి వైద్యం కార్యక్రమంలో భాగంగా 97వ ఉచిత వైద్య శిబిరం  భువనగిరి మండలం ముస్తాలపల్లి గ్రామంలో నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరం కార్యక్రమంలో సర్పంచ్ గంటపాక యాదగిరి, ఎంపీటీసీ కంచి లలితా మల్లయ్య, ఉప సర్పంచ్ వడ్డే మదార్, దంత వైద్యురాలు డాక్టర్ చావా అశ్లేష, ఎనస్తీషియాలజిస్ట్ డాక్టర్ వి రాజ్ కుమార్, ఆప్తమాలజిస్ట్  డాక్టర్ సుమంత్ రెడ్డి, కేర్ హాస్పిటల్  సీనియర్ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ శ్యామ్ కె జైశ్వాల్, న్యాయవాది సిద్ధిరాములు పాల్గొన్నారు.

Spread the love