ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ‘తెలంగాణ మోడల్‌పై` ఎమ్మెల్సీ కవిత కీలక ప్రసంగం..

నవతెలంగాణ హైదరాబాద్: భారత దేశానికి తెలంగాణ అభివృద్ధి మోడల్ దిక్చూచి అని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో (Oxford University) ‘ఎక్స్‌ప్లోరింగ్‌ ఇన్‌క్లూసివ్‌ డెవలప్‌మెంట్‌-ది తెలంగాణ మాడల్‌’ అనే అంశంపై కవిత కీలకోపన్యాసం చేశారు.  ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో అతి తక్కువ సమయంలో తెలంగాణ (Telangana) అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందని, సమ్మిళిత, సమగ్ర అభివృద్ధి సాధించిందని వివరించారు. పరిపాలనలో మానవీయ కోణాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రిని అభినవ చాణక్యగా అభివర్ణించారు. అహింసా మార్గంలో తెలంగాణను సాధించిన గాంధీ.. సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు. ఒకప్పుడు బీడువారిన భూములను పచ్చని పంటపొలాలుగా తీర్చిదిద్ది దేశానికి స్ఫూర్తినిచ్చారన్నారు.

Spread the love