దేవుడిని బజారులోకి తెచ్చిన మోడీ

– దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి
– దానంను గెలిపించే బాధ్యత మీదే
– సికింద్రాబాద్‌లో కాంగ్రెస్‌ గెలుస్తోంది
– సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో-బేగంపేట్‌
‘దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గెండెల్లో ఉండాలి కానీ దేవుడిని ప్రధాని మోడీ బజారులోకి తీసుకొచ్చారు. మత చిచ్చుపెట్టి ఎన్నికల్లో గెలవాలని బీజేపీ చూస్తోంది’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం సికింద్రాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పీ. శివ శంకర్‌, మర్రి చెన్నారెడ్డి సికింద్రాబాద్‌ ప్రాంతానికి చెందిన వారేనని తెలిపారు. సికింద్రాబాద్‌ నుండి ఎంపీగా ఏ పార్టీ గెలుస్తాదో అదే పార్టీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆనవాయితీ ఉందని.. సికింద్రాబాద్‌లో దానం గెలుస్తారని.. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే రాబోతుందన్నారు. హైదరాబా ద్‌ను అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. జంట నగరాల్లో మెట్రో రైలు అవ్వడానికి కాంగ్రెస్సే కారణమన్నారు. మెట్రో రైలును వైస్సార్‌ ప్రభుత్వం తెచ్చిందన్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్‌ పోర్ట్‌లు తీసుకువచ్చింది కాంగ్రెస్‌నని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు న్యాయం చేసే బాధ్యత తమదేన్నారు. మత సామరస్యాన్ని కాపాడింది కాంగ్రెస్‌ పార్టీనే అన్నారు. తెలంగాణ ఏర్పాటును మోడీ అవమానించారని గుర్తు చేశారు.
ఉజ్జయిని మహాకాళి దేవస్థానంలో ప్రత్యేక పూజలు..
ప్రఖ్యాత సికింద్రాబాద్‌ శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవస్థానంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం కాంగ్రెస్‌ సికిం ద్రాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థిగా దానం నాగేందర్‌ నామినేషన్‌ కార్యక్రమానికి హాజరైన ఆయన ముందు గా దానం నాగేందర్‌, ఆయన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బోనాలు, పోతరాజులు, డప్పు చప్పుళ్ల మధ్య ప్రచార రథంపై దానం నాగేందర్‌తో కలిసి ఊరేగింపుగా జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి బయలు దేరారు. దానం మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం బీజేపీతో కలిసి పని చేద్దామని అనడం తనకు నచ్చలే దని, తాను సెక్యులర్‌ వాదినన్నారు. మతతత్వ పార్టీ తో పనిచేయడం ఇష్టంలేక తిరిగి కాంగ్రెస్‌లో చేరిన ట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్‌ కుమా ర్‌ యాదవ్‌, మాజీ ఎంపీలు వి.హనుమతరావు, అంజన్‌ కుమార్‌ యాదవ్‌, మహమ్మద్‌ అజారుద్దీన్‌, ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్‌, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌ మోతే శ్రీలతరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్య దర్శి డాక్టర్‌ కోట నీలిమ, కార్యవర్గ సభ్యులు మర్రి ఆదిత్య రెడ్డి, ఆల్‌ ఇండియా కన్జ్యూమర్‌ రైట్స్‌ జాతీ య కార్యదర్శి డాక్టర్‌ రవి శేఖర్‌ రెడ్డిలతోపాటు పెద్ద ఎత్తున నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

Spread the love