ప్రజా సంపదలను కొల్లగొట్టి కార్పొరేట్ సంస్థలకు కట్టి పెడుతున్న మోడీ..

– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ – నూతనకల్
కేంద్రంలో పది సంవత్సరాలు పాలన కొనసాగించిన ప్రధాని మోడీ ప్రజా సంపదలను కొల్లగొట్టి కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహిస్తున్న భువనగిరి పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ.. నిరంతరం స్థానిక ప్రజా సమస్యలపై పోరాడే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి జహంగీర్ కు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. దేశంలో గత పాలనలో మతోన్మాత బీజేపీ కుల, మతాలతో ప్రజలను విభజిస్తూ రాజకీయం చేస్తుందని విమర్శించారు. గత ఎన్నికలలో బీజేపీ చేసిన వాగ్దానాల అమలులో పూర్తిగా విఫలమైందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీ లకే కట్టిపెట్టి అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసిన మోడీని మతతత్వ బీజనపీని ఓడించాలని వారన్నారు. అవకాశవాద రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ ను, ఓడించాలని కోరారు. నియోజకవర్గంలో ధన బలానికి, ప్రజా బలానికి మధ్య జరిగే పోటీలు ప్రజా ఫలం ఉన్న పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. అవకాశవాదంగా పూటకో పార్టీ మార్చే అభ్యర్థులను ఓడించి ప్రజా సమస్యలపై పోరాడే వారిని గుర్తించి ఓటెయ్యాలని అన్నారు. రాష్ట్రంలో గత పాలకులు నియంత , కుటుంబ పాలన మరో నిజాం పాలన కొనసాగిందని ఎన్నికలలో కెసిఆర్ ను ఓడించినట్టే దేశంలో బీజేపీని కాంగ్రెస్ ను ఓడించి సమస్యలపై పోరాడే అభ్యర్థి జహంగీర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి కార్యవర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి, భువనగిరి పార్లమెంటు అభ్యర్థి ఎండి జహంగీర్, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, నెమ్మాది వెంకటేశ్వర్లు, మట్టపల్లి సైదులు, కోట గోపి, జిల్లా కమిటీ సభ్యులు పులుసు సత్యం, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి, మండల నాయకుల తదితరులు పాల్గొన్నారు.

Spread the love