మోడీ విజన్‌ 2047

– కేంద్ర మంత్రి అర్జున్‌రాం మేఘ్‌వాల్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
విజన్‌ 2047 లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోడీ పనిచేస్తున్నారని కేంద్ర మంత్రి అర్జున్‌రాం మేఘ్‌వాల్‌ అన్నారు. మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌లో భాగంగా సోమవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో బీజేపీ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. తొమ్మిదేండ్ల కాలంలో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మేఫ్‌ువాల్‌ మాట్లాడుతూ.. దేశంలో రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామన్నారు. స్వచ్ఛభారత్‌లో మోడీనే చీపురు పట్టి ఊడ్చారన్నారు.

Spread the love