ప్రారంభించిన మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గాంధీ ఆస్పత్రిలో మదర్ మిల్క్ బ్యాంక్, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్‌ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం ప్రారంభించారు. ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్‌లో ఉండే వివిధ విభాగాలు, వాటి పనితీరును ఈ సందర్భంగా డాక్టర్లు మంత్రికి వివరించారు.ఉస్మానియాలో 18 నెలల చిన్నోడిని సక్సెస్‌ఫుల్‌గా లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసిన ఉస్మానియా గ్యాస్ట్రోఎంట్రాలజీ హెచ్‌వోడీ, డాక్టర్ మధుసూదన్‌ను మంత్రి సన్మానించారు. గాంధీ ఐవీఎఫ్ సెంటర్‌లో ఐవీఎఫ్ చేయించుకుని అక్కడే కవల పిల్లలకు జన్మనిచ్చిన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. గాంధీ మెడికోల 68వ బ్యాచ్ ఎంబీబీఎస్ విద్యార్థుల స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొని, విద్యార్థులకు పట్టాలు అందజేశారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ వైద్య వృత్తి ఒక ఉద్యోగం కాదు. జీవితాంతం మానవసేవకు అంకితమయ్యే కర్తవ్యమని చెప్పారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ఈ వృత్తి ప్రధాన లక్ష్యమన్నారు. కోవిడ్ సమయంలో లక్ష మంది పేషెంట్లకు చికిత్స అందించిన ఘనత గాంధీ సొంతమని గుర్తు చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు గాంధీ హాస్పిటల్‌ను మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీలున్నాయనీ, గత రెండేండ్లలో కొత్తగా 9 మెడికల్ కాలేజీలు, 16 నర్సింగ్ కాలేజీలు, 28 పారామెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని చెప్పారు. గాంధీ, ఉస్మానియా విద్యార్థుల కోసం రూ.210 కోట్లతో అత్యాధునిక హాస్టల్ భవనాలు నిర్మిస్తున్నామన్నారు. రెండేండ్లలో ఆరోగ్యశాఖలో సుమారు 12,700 పోస్టులను భర్తీ చేశామనీ, మరో 4,200 పోస్టుల భర్తీ కొనసాగుతోందని తెలిపారు. వైద్య ఖర్చుల కారణంగా ఏ కుటుంబం ఇబ్బందులు పడకూడదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్, హెల్త్ j¶నివర్సిటీ వీసీ రమేశ్ రెడ్డి, డీఎంఈ నరేంద్ర కుమార్, గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఇందిరా, సూపరింటెండెంట్ వాణి తదితరులు పాల్గొన్నారు.
గాంధీ హాస్పిటల్‌లో మదర్ మిల్క్ బ్యాంక్, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



