ఘనంగా ఎంపీపీ కరుణాకర్ పుట్టినరోజు వేడుకలు 

నవతెలంగాణ-చేర్యాల:
చేర్యాల ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.కడవేరుగు గ్రామ శివారులో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు సోమవారం జనగామ ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన అనంతరం ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్  నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో ఎంపీపీ కర్ణాకర్ తో కేక్ కట్ చేయించారు. అనంతరం చేర్యాల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో కూడా  పలువురు మండల,చేర్యాల పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు ఎంపీపీ తో కేక్ కట్ చేయించారు. విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చేర్యాల పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం అధ్యక్షుడు పెంబర్ల రాజశేఖర్, బీఆర్ఎస్ యూత్ చేర్యాల పట్టణ అధ్యక్షుడు యాట బిక్షపతి, ఎర్రోళ్ల యాదగిరి, ఉల్లంపల్లి స్వామి తదితరులు పాల్గొన్నారు.
Spread the love