ఊరురా వాడవాడలా ఉత్సవాలను పండగలా జరిపించాలి: ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి

నవతెలంగాణ-గోవిందరావుపేట
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలను ఊరు రా వాడవాడలా పండగల జరిపించాలని ఎంపీపీ శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో జూన్ 22 వరకు జరగబోయే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎంపీపీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ప్రతి గ్రామంలోనూ ప్రతి వాడలోనూ ప్రతి వీధిలోను ఒక పండగల జరిపించాలని అందుకు అధికారులు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని అన్నారు.మండల ప్రత్యేక అధికారి నాగ పద్మజ మాట్లాడుతూ రోజువారి కార్యక్రమాలలో శాఖల పరంగా ఉన్న కార్యక్రమాలు ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని ఆదేశించినారు. ఎంపీడీవో జూలూరు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ అన్ని గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించనైనది ప్రత్యేక అధికారులను తమ వంతు పాత్ర పోషించి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయాలని కోరినారు.ఈ కార్యక్రమంలో ఎంపిటిసిలు, సర్పంచులు, అధికారులు తాసిల్దార్ అల్లం రాజ్ కుమార్, వ్యవసాయ అధికారి జితేందర్ రెడ్డి, ఎం ఈ ఓ దివాకర్, మండల పంచాయతీ అధికారి సాజిదా బేగం, డి ఈ ఐ బి శ్రీనివాస్, ఎఫ్ ఆర్ ఓ మాధవి శీతల్,పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.

 

Spread the love