ఎమ్మెల్యే  గ్రాఫ్ పడిపోయినట్లేనా..?

– కొద్దీ రోజులుగా కార్యక్రమాలకు దూరం
– కెడిసిసి బ్యాంక్ ప్రారంభోత్సవానికి హాజరు కానీ  రమేష్ బాబు
– టికెట్ రకపోవడమే కారణమా!
నవతెలంగాణ- చందుర్తి
వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు గ్రాఫ్ పడి పోయిందా అనే మాటకొస్తే నిజమేనా అనే ప్రశ్న వస్తుంది.ఎందుకంటే వేములవాడ టికెట్ లక్ష్మి నర్సింహా రావుకు అధిష్టానం ఇచ్చింది. దింతో ఎమ్మెల్యే  అసహనం తో అలిగినట్లుగా తెలుస్తుంది.దింతో నియోజక వర్గంలో కొన్ని కార్యక్రమంలో పెద్దగా  కనపడక పోవడమే చెప్పక తప్పదు.
ప్రోటో కాల్ ఉన్నా హాజరు కానీ ఎమ్మేల్యే రమేష్ బాబు
శుక్రవారం చందుర్తి మండల కేంద్రంలో నూతనంగా కెడిసిసి బ్యాంక్ ప్రారంభించారు.ఇట్టి కార్యక్రమంలో ప్రోటో కాల్ ఉన్నప్పటికీ హాజరు కాకపోవడంతో  టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు ప్రారంభించారు.దింతో  ఎమ్మెల్యే గ్రాఫ్ తగ్గిందా! అనే  ఇక్కడ నాయకుల   కార్యకర్తల సమాధానం వినిపిస్తుంది.
టికెట్ రకపోవడమే కారణమా?
టికెట్ రకపోవడమే కారణంగా రమేష్ బాబు అంతంత మాత్రమే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడనే తెలుస్తుంది.లక్ష్మి నర్సింహా రావు టికెట్ రావడంతో రమేష్ బాబు క్యాడర్ మొత్తం అటు వైపుగా గానే చేరిందని జవాబు వస్తుంది.ఎందుకంటే ఒకవేళ రేపు గెలిస్తే రమేష్ బాబు క్యాడర్ అనే ముద్ర పడవద్దని ముందుగానే ఎవరికి వారు ముఖాలు చూపిస్తూ వస్తున్నారు.దింతో రమేష్ బాబు క్యాడర్ పోయి  గ్రాఫ్ తగ్గిందా అనే సమాధానం .ఇనపడుతుంది.

Spread the love