నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి బీ ఫార్మసీ, ఫార్మా-డీ, బయోటెక్నాలజీ, ఫార్మాసూటికల్ ఇంజినీరింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ బైపీసీ విద్యార్థులకు శనివారం నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. శనివారం నుంచి ఆన్‌లైన్‌లో ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించడంతోపాటు హెల్ప్‌లైన్ సెంటర్లలో ధ్రువపత్రాల పరిశీలనకు వెళ్లేందుకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఈనెల నాలుగు, ఐదు తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఈనెల నాలుగు నుంచి ఏడు వరకు వెబ్‌ఆప్షన్ల నమోదుకు అవకాశముంటుంది. ఇతర వివరాల కోసం ష్ట్ర్‌్‌జూర://్‌రవaఎషవ్b.అఱష.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదిం చాలి. బీఫార్మసీలో 114 కాలేజీల్లో 6,910 సీట్లు, ఫార్మా-డీలో 61 కాలేజీల్లో 1,191 సీట్లు, బయోటెక్నాలజీలో మూడు కాలేజీల్లో 94 సీట్లు, బయో మెడికల్ ఇంజినీరింగ్‌లో రెండు కాలేజీల్లో 36 సీట్లు, ఫార్మాసూటికల్ ఇంజినీరింగ్‌లో రెండు కాలేజీల్లో 81 సీట్లు కలిపి మొత్తం 8,312 సీట్లు అందుబాటులో ఉన్నాయి.