నవతెలంగాణ-లక్షెట్టిపేట
లక్షెటిపేట మున్సిపల్ పరిధిలోని మిషన్ కాంపౌండ్ ఏరియాలో నిత్యం రద్దీగా ఉండే రహదారి ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డుపై వాహనాలు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందని, ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, సంబంధిత మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కాలనీవాసులు, వాహనదారులు కోరుతున్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురికి నీరు రోడ్డుపై నిలవడంతో గుంతలు ఏర్పడి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అంతే కాకుండా దోమలు, పాములు విపరీతంగా పెరుగుతున్నాయి.