మున్నూరు కాపు సింహ గర్జనకు భారీగా తరలి రావాలి..

– డిమాండ్ల సాధనకు ఐక్యమత్యంగా పోరాడుదాం,

– పోస్టర్లు కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో నాయకులు,
నవతెలంగాణ- మద్నూర్
ఈనెల 21న గురువారం నాడు బిచ్కుంద మండల కేంద్రంలో నిర్వహించే మున్నూరు కాపు సింహ గర్జన కార్యక్రమానికి భారీ ఎత్తున తరలి రావాలని మున్నూరు కాపుల డిమాండ్ల సాధనకు ఐక్యమత్యంగా పోరాడుదామని పిలుపునిస్తూ గురువారం నాడు మద్నూర్ మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో జుక్కల్ నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి ముఖ్య నాయకులు హాజరయ్యారు. బిచ్కుంద లో నిర్వహించే మున్నూరు కాపు సింహ గర్జన పోస్టర్లు మరియు కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గం లోని మద్నూర్ బిచ్కుంద డోంగ్లి జుక్కల్ పెద్ద కోడప్పుగల్ పిట్లం నిజాంసాగర్ మహమ్మద్ నగర్ మండలాల నుండి సింహం గర్జనకు మున్నూరు కాపులంతా పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మున్నూరు కాపులకు అమలు చేయవలసిన డిమాండ్ల గురించి ఆయా మండలాల ముఖ్య నాయకులు వివరించారు.
1. సంవత్సరానికి 5000 కోట్లతో మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.
2. మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహాన్ని ఎండోమెంట్ బోర్డు నుండి తొలగించి మున్నూరు కాపులకు అప్పగించాలి.
3. మున్నూరు కాపు ప్రతి కుటుంబానికి కుల వృత్తుల సహాయం కింద ఐదు లక్షల రూపాయలు కేటాయించాలి.
4. ఈడబ్ల్యూఎస్ ప్రకారంగా మున్నూరు కాపులకు ప్రత్యేక 10% రిజర్వేషన్ అమలు చేయాలి లేదా బి సి డి కి 23 శాతం రిజర్వేషన్ కల్పించాలి.
5. మున్నూరు కాపుల పేరు చివరన పటేల్ అని ప్రభుత్వమే గెజిట్ చేయాలి.
6. ఏరువాక పౌర్ణమి పండుగను రైతు పండుగగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించి అధికారికంగా జరపాలి
7. మున్నూరు కాపు పండించిన పంటకే బీమాను అందించి ప్రకృతి నుండి దళారుల నుండి రైతులను ఆదుకోవాలి.
8. మున్నూరు కాపు విద్యార్థులు పై చదువుల కొరకు విదేశాలకు వెళ్లే వారికి ఓవర్సీస్ స్కాలర్షిప్ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలి.
ఇలాంటి డిమాండ్ల సాధన కోసం జుక్కల్ నియోజకవర్గం స్థాయి మున్నూరు కాపు సింహ గర్జన బిచ్కుంద మండల కేంద్రంలో ఈనెల 21న జరిగే కార్యక్రమానికి భారీగా తరలి వెళ్దాం డిమాండ్లను సాధించుకుందాం అంటూ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన మున్నూరు కాపు సంఘం నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ఎస్ గంగారం, మద్నూర్ గ్రామ సంఘం అధ్యక్షులు డాక్టర్ బండి వార్ విజయ్, సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్ హనుమాన్లు, ఉపాధ్యక్షులు కర్ల సాయిలు, అనుమువార్, హనుమాన్లు, కోశాధికారి చందర్, నియోజకవర్గంలోని ఆయా మండలాల ముఖ్య నాయకులు, మద్నూర్ గ్రామ మున్నూరు కాపు ముద్దుబిడ్డలు పాల్గొన్నారు.
Spread the love