
నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ముప్ప గంగారెడ్డి నియమించబడిన తర్వాత మొదటిసారి జిల్లాకు రావడంతో మోపాల్ మండల కాంగ్రెస్ నాయకులు మాధవ నగర్ సాయిబాబా ఆలయంలో ఘన స్వాగతం పలికారు. ఆయన తొలిసారి పదవి వరించిన తర్వాత జిల్లాకు రావడంతో సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముప్పగంగారెడ్డి మాట్లాడుతూ.. నాకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి రావడం రూరల్ ఎమ్మెల్యే భూపతి రడ్డి గారి కృషి వల్లనే నాకు ఈ పదవి లభించిందని ఆయనకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారికి బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే నా మండల కాంగ్రెస్ నాయకులకు మరియు రూరల్ నియోజకవర్గం ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తాను ఈ స్థాయికి రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి నాయకుడికి గుర్తింపు ఉంటుందని ఇందుకు ఉదాహరణ నేనే అని ఆయన తెలిపాడు. అందుకే కచ్చితంగా ప్రతి కాంగ్రెస్ సైనికుడు పార్టీ కోసం కష్టపడాలని రానున్న స్థానిక సంస్థలు ఎన్నికల్లో కూడా పార్టీ అభ్యర్థులు విజయంక మోగించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మోపాల్ మండల అధ్యక్షుడు సాయి రెడ్డి, సందీప్ రెడ్డి, సతీష్ రావు, ఓడ్డే రాములు, మాజీ జెడ్పిటిసి మోహన్ నాయక్, తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.