నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్గా ముప్ప గంగారెడ్డి

Muppa Gangareddy is the Chairman of Nizamabad Market Committee– రైతు నాయకుడికే అవకాశం దక్కింది 
– రాజకీయ జీవితమంతా కాంగ్రెస్ తోనే
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్గా రైతు నాయకుడికి అవకాశం దక్కింది. తన రాజకీయం జీవితమంతా కాంగ్రెస్ తోనే ఉన్నాడు. రైతు నాయకుడు ముప్ప గంగారెడ్డి నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులయ్యారు. ఈ మేరకు వ్యవసాయ సహకార శాఖ కార్యదర్శి రఘునందన్ రావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వైస్ చైర్మన్ గా జంగిటి రాంచందర్ తోపాటు 11 మంది డైరెక్టర్లను నియమించారు. రాజకీయ జీవితం ప్రారంభం నుంచి కాంగ్రెస్ లోను కొనసాగుతున్న ముప్ప గంగారెడ్డికి తగిన గుర్తింపు లభించిందని పార్టీ శ్రేణులు హర్షిస్తున్నాయి.
పాలకవర్గం సభ్యులు..
ముప్ప గంగారెడ్డి (చైర్మన్), జంగిటి రాంచందర్(వైస్ చైర్మన్), డైరెక్టర్లుగా ఐల రాజలింగం, యెన్నం బాగారెడ్డి, దండ్ల రాజన్న, మెదావత్ మంగిత్యా, జి గంగారెడ్డి, వంగల దేవకరుణ, పెంట ఇంద్రుడు, సైనేని వెంకటేశ్వరరావు, కౌడపు రఘువీర్, మహ్మద్ ఎసా, జోగిని మల్లేశ్, అతిగటి నరేందర్ నియమితులయ్యారు. వీరితోపాటు ఇద్దరు ట్రేడర్లు, నలుగురు ఎక్స్ అఫీషియో మెంబర్లను కార్యవర్గంలో నియమించారు.
సొసైటీ డైరెక్టర్ నుంచి ముప్ప పయనం..
ముప్ప గంగారెడ్డి 1987లో బాడ్సి సొసైటీ డైరెక్టర్ గా పని చేశారు. 1988 లో ముదక్ పల్లి-నర్సింగ్ పల్లి సర్పంచ్ గా, 1995లో ముదక్ పల్లి – నర్సింగ్ పల్లి ఎంపీటీసీగా విజయం సాధించి వైస్ ఎంపీపీగా పని చేశారు. 2005 14 వరకు సింగిల్ విండో చైర్మన్, డీసీసీబీ డైరెక్టర్ గా ఉన్నారు. జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా పని చేసిన ఆయన 2015 నుంచి కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఎన్నో అవకాశాల కోసం ఎదురు చూడగా ప్రస్తుతం నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి దక్కింది. దీంతో వారి కుటుంబ సభ్యులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మిత్రులు తోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఆనందాన్ని వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
Spread the love