ముప్పనపల్లి సహాయనిది టీమ్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం

నవతెలంగాణ-గోవిందరావుపేట : ముప్పనపల్లి గ్రామంలో ముప్పనపల్లి సహాయనిది సభ్యుల ఆధ్వర్యంలో గురువారం రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఎంపీపీ జనగం సమ్మక్క సర్పంచ్ చిదరి మౌనిక వివిధ గ్రామాల యువకులు, ప్రజాప్రతినిధులు, మీడియామిత్రులు, గ్రామపెద్దలు, సహా 36 మంది చాలా అధికసంఖ్యలో ఎంతో ఉత్సాహంతో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఎంపీపీ మౌనిక మాట్లాడుతూ అన్ని దానాల కంటే రక్తదానం చాలా అమూల్యమైందని ప్రాణాలను కాపాడే ఉత్తమ ధనము అని అన్నారు. రక్తదానం చేసిన వారికీ కన్నాయిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ గిరిబాబు, డాక్టర్ అభినవ్  సర్టిఫికెట్స్ కూడ ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా ఈ కార్యక్రమంలో కన్నాయిగూడెం ఎస్ ఐ సురేష్,  ముప్పనపల్లి సహాయనిది సభ్యులు అబ్బు సతీష్, చీదరి సుమన్, చిట్యం శ్రీను, జాడి రాంబాబు, కావిరి సంతోష్  వెంకటేష్, ఎండి షాయకు,వంగరి రాజు,తిప్పనపల్లి రమేష్, విజయ్,కిరణ్,రాజు, వెంకట్, సతీష్, మహేష్, సంతోష్, ప్రవీణ్, అరికిళ్ల సంపత్, నామని రాజేష్, సమ్మెట రాజేష్, అచ్చ నరేష్, దేపాక రమేష్, రవి, బాలు, రామక్రిష్ణ, సుగ్గుల మహేష్, దాసరి నర్సింహారావు, పుల్యాల మహేష్, పల్ల శ్రీను బుద్దె చిట్టిబాబు, రోషరావు,తూరం రమేష్, వాసం మధు, పటేల్ సంజీవ్, ప్రమోద్, మునీర్,తదితరులు పాల్గొన్నారు
Spread the love