విపత్తుల నివారణపై అవగాహన కలిగి ఉండాలి

– ఆదనవు కలెక్టర్ బి.ఎస్. లత.
నవతెలంగాణ సూర్యాపేట కలెక్టరేట్
ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు తీసు కోవల్సిన చర్యలపై అధికారులకు అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ బి.ఎస్ లతా అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర విపత్తుల సంస్థ, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఆధ్వర్యంలో జిల్లా అధికారులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.విపత్తుల సమయాల్లో ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణలో ఎదురయ్యే ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ విపత్తుల నివారణ చర్య లపై ప్రతి ఒక్కరికీ అవగాహన తప్పనిసరిగా ఉండాలన్నారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఈనెలాఖరులోగా జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారికి అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు యస్.పి నాగేశ్వర రావు,  జెడ్పీ సీఈఓ అప్పారావు, డి.ఎఫ్.ఓ సతీష్ కుమార్, వివిధ శాఖల అధికారులు రాష్ట్ర విప త్తుల మేనేజ్మెంట్ కోఆర్డినేటరు గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love