నా రోల్ మోడల్ మంత్రి శ్రీదర్ బాబు

– కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ
నవతెలంగాణ మల్హర్ రావు: తాను 2004లో మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి, నేసనల్ కాంగ్రెస్ పార్టీ మినిపేస్టో చైర్మన్ దుద్దిళ్ల శ్రీదర్ బాబును కలిశానని అప్పుడే ఆయనతో మీరే నా రోల్ మోడల్ అని చెప్పినట్లుగా పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన నవతెలంగాణతో మాట్లాడారు. తనను పెద్దపల్లి ఎంపీగా గెలిపిస్తే కష్టపడి ప్రజలకు అందుబాటులో ఉంటూ పని చేస్తానని పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు.తనకు మద్దతుగా నిలిచిన ఐటి మంత్రి దుద్దిళ్ల తోపాటు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యే లు అడ్డురి లక్ష్మన్ కుమార్, విజయరమణ రావు, ప్రేమ్ సాగర్ రావు, ఠాకూర్ మక్కాన్ సింగ్, గడ్డం వివేక్, గడ్డం వినోద్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి శ్రీదర్ బాబు ఆశీర్వాదంతోనే తనకు ఎంపీ టికెట్ వచ్చిందన్నారు. కాకా వెంకటస్వామి చేసిన సేవలు కొనసాగిస్తానన్నారు.

Spread the love