ఏపీపీఎస్సీలో నారాయణ ఐఏఎస్‌ అకాడమి సత్తా

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్‌-1 పరీక్ష ఫలితాల్లో నారాయణ ఐఏఎస్‌ అకాడమి సత్తాచాటింది. ఈ మేరకు నారాయణ గ్రూప్‌ డైరెక్టర్లు పి సింధూర నారాయణ, పి శరణి నారాయణ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రూప్‌-1 పలితాల్లో 13 మంది డిప్యూటీ కలెక్టర్లుగా ఎంపికైతే అందులో ముగ్గురు నారాయణ విద్యార్థులే కావడం గర్వకారణమని తెలిపారు. ఎం భానుప్రకాశ్‌రెడ్డి, కె సాయి ప్రత్యూష, పి సువర్ణరెడ్డి డిప్యూటీ కలెక్టర్లుగా ఎంపికయ్యారని వివరించారు. పట్టుదల, నిరంతర కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదంటూ నారాయణ విద్యార్థులు నిరూపించారని పేర్కొన్నారు.

Spread the love