– టీఎన్‌ఎస్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఎంపీహెచ్‌ఏ) ఉద్యోగ నియామకాల్లో పురుష అభ్యర్థులకు కూడా అవకాశం కల్పించాలని తెలంగాణ నర్సింగ్ సమితి (టీఎన్‌ఎస్) కోరింది. ఈ మేరకు సమితి రాష్ట్ర అధ్యక్షులు కె.ధనుంజయ తెలంగాణ మెడికల్, హెల్త్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మెన్‌కు వినతి పత్రం సమర్పించారు. ఎంపీహెచ్‌ఏ (మేల్) అభ్యర్థులు 2004 నుంచి శాశ్వత ఉద్యోగాల ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారని గుర్తుచేశారు. ఇటీవల బోర్డు నుంచి వచ్చిన నోటిఫికేషన్‌లో పురుష అభ్యర్థులకూ అవకాశం కల్పించాలని కోరారు.