ఈనెల 18న జాతీయ లోక్‌ అదాలత్‌

అత్యధిక కేసుల పరిష్కారానికి సహకరించాలి
నవతెలంగాణ-ములుగు
ఈనెల 18న జరిగే జాతీయ లోక్‌ అదాలత్‌లో అత్యధిక కేసుల పరిష్కారానికి సహకరించాలని జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ పీవీపీ లలిత శివజ్యోతి అన్నారు. ములుగు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 10న నిర్వహించబడే జాతీయ లోక్‌ అదాలత్‌ సందర్భంగా జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ పీవీపీ లలితశివజ్యోతి శుక్రవారం బార్‌ అసోసియేషన్‌ మెంబర్స్‌ ములుగు, పోలీస్‌అధికారులు, ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ అధికారులతో వేర్వేరుగా సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో పీవీపీ లలితశివజ్యోతి మాట్లాడుతూ జాతీయ, రాష్ట్ర న్యాయసేవ అధికార సంస్థల సూచనల మేరకు ఈనెల 10న ములుగు జిల్లా వ్యాప్తంగా నిర్వహించబడే జాతీయ లోక్‌ అదాలత్‌లో అత్యధిక కేసుల పరిష్కారానికి బార్‌ అసోసియేషన్‌ మెంబర్స్‌ ములుగు, పోలీస్‌ అధికారులు, ఎక్సైజ్‌ అధికారులు సహకరించాలని తెలిపారు. రాజీ పడదగు కక్షిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారిని ఎటువంటి ఒత్తిడిలకు గురి చేయకుండా రాజీమార్గం ద్వారా వారి కేసును పరిష్కరించుకునేలా అందరూ సహాయపడాలని తెలిపారు. లోక్‌ అదాలత్‌ పట్ల ఎటువంటి న్యాయ సలహా, సూచనల కొరకు అయిననూ న్యాయ సేవాధికార సంస్థలను ఆశ్రయించి, న్యాయ సలహాలు, సూచ నలను పొందగలరని తెలిపారు.ఈకార్యక్రమంలో ములుగు జిల్లా న్యాయ సేవా ధికార సంస్థ, కార్యదర్శి టి.మాధవి, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి డి.రామమోహన్‌రెడ్డి, ములుగు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు సిహెచ్‌ వేణు గోపాలచారి, బార్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ మేకల మహేందర్‌, న్యాయ వాదులు ఎం.వినరుకుమార్‌, ఎం. వెంకటేశ్వర్‌రావు, R భిక్షపతి, కె.సునీల్‌ కుమార్‌, బి.శ్యామ్‌ ప్రసాద్‌, బి.స్వామి దాస్‌, డి.రామ్‌సింగ్‌, ఆర్‌.రాజకుమార్‌, ఎన్‌.రవీందర, ఎస్డిపిఓ, డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ ( డిసిఆర్బి), ఎన్‌.సుభాష్‌బాబు. డీఎస్పీ రవీందర్‌, సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ ఎం.రంజిత్‌కుమార్‌, స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్లు, పోలీస్‌ అధికారులు, ఎక్సైజ్‌ అధికారులు పాల్గొన్నారు

Spread the love