Monday, June 8, 2026
E-PAPER
Homeకరీంనగర్ఆలూరులో జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రతినిధి సర్వే

ఆలూరులో జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రతినిధి సర్వే

- Advertisement -

నవతెలంగాణ-రాయికల్
మండలంలోని ఆలూరు గ్రామపంచాయతీని జాతీయ గ్రామీణాభివృద్ధి,పంచాయతీరాజ్ సంస్థ ప్రతినిధి సుధాకర్ రెడ్డి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ సభల్లో ప్రజల పాల్గొనింపు స్థాయి, గ్రామపంచాయతీ పరిధిలో అమలవుతున్న అభివృద్ధి పనులపై సమగ్ర సర్వే నిర్వహించారు. గ్రామస్థుల అభిప్రాయాలను సేకరిస్తూ.. గ్రామ సభల నిర్వహణలో ఉన్న లోపాలు, వాటి మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. అలాగే పలు సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు.సేకరించిన వివరాల ఆధారంగా సమగ్ర నివేదికను జాతీయ స్థాయి ప్రభుత్వ శాఖకు సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి బి. చిరంజీవి,మండల పంచాయతీ అధికారి కె. సుష్మ, సర్పంచ్ ఎన్. స్వామి,పంచాయతీ కార్యదర్శి రమ్యకృష్ణ,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -