
ఆదివారం రోజున మంచిప్ప గ్రామంలో వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని యువజన సంఘాలు మరియు వాటి ప్రతినిధులు వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి మోపల్ మండల్ ఏఎస్ఐ దయల్ సింగ్ మాట్లాడుతూ స్వామి వివేకానంద తన ప్రవచనాలు మరియు రచనలను ఆధునిక యువత అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు అనంతరం వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్ మరియు పెన్నులు ప్రధానం చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో వీడిసి అధ్యక్షులు వెంకటరామ్ నాయక్ ,మాజీ సర్పంచ్ సిద్ధార్థ,మాజీ కోఆప్షన్ మెంబర్ అజీమ్, జై భారత్ యూత్ అధ్యక్షులు సాయిరాం, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తూర్పు రాజేష్ ,మాజీ జెడ్పిటిసి కమల నరేష్ , హిందు వాహిని జిల్లా ప్రచారక్ ప్రసాద్ ,వీడీసీ రైటర్ గుండుగుల శ్రీనివాస్ ,మాజీ ఉపసర్పంచ్లు ముత్యంరెడ్డి ,జగదీష్ యాదవ్ మాజీ విడిసి అధ్యక్షులు గాంధారి శ్రీనివాస్, సత్యనారాయణ ,నవీన్ మరియు కర్ల సుభాష్ ,కోమటి రాము , చింతకుంట సాయి రెడ్డి మరియు మంచిప్పలోని అన్ని యువజన సంఘాల సభ్యులు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు