ఎఫ్‌ఐఏ ఏఆర్‌సి మౌంటెన్ గోరిల్లా ర్యాలీ
నవతెలంగాణ-హైదరాబాద్ :
హైదరాబాద్‌కు చెందిన ర్యాలీ డ్రైవర్ నవీన్ పులిగిళ్ల ప్రతిష్టాత్మక ఎఫ్‌ఐఏ ఆఫ్రికన్ ర్యాలీ చాంపియన్‌షిప్ (ఏఆర్‌సీ) రువాండా మౌంటెన్ గోరిల్లా ర్యాలీ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. సీనియర్ డ్రైవర్ మూసా షరీఫ్ (కాసరగోడ్)తో కలిసి ఏఆర్‌సి3 విభాగంలో 18 స్పెషల్ స్టేజీలలో నవీన్, షరీఫ్ జోడీ 12 స్టేజ్‌లలో ముందంజలో నిలిచింది. కఠినమైన గ్రావెల్ రోడ్లపై గంటకు 170కిమీ దూసుకెళ్లారు. రేసు మధ్యలో సాంకేతిక సమస్య ఎదురైనా 2 గంటల 13 నిమిషాల 48.3 సెకన్లలో ర్యాలీని పూర్తి చేసి విజేతలుగా నిలిచారు. ‘అత్యంత కఠినమైన గ్రావెల్ స్టేజ్‌లలో ఒకటైన ఈ ర్యాలీ టైటిల్ సాధించటం గర్వంగా ఉంది. ఓవరాల్‌గా చాంపియన్‌షిప్స్‌లో నాల్గో స్థానంలో నిలిచానని’ నవీన్ అన్నాడు.
నవీన్‌కు రువాండా ర్యాలీ టైటిల్
- Advertisement -
- Advertisement -



