Tuesday, July 14, 2026
E-PAPER
Homeఆటలురోకో రాకతో రాత మారేనా?

రోకో రాకతో రాత మారేనా?

- Advertisement -

టీమ్ ఇండియాకు కోహ్లి, రోహిత్‌ జోష్‌
భారత్‌, ఇంగ్లాండ్‌ తొలి వన్డే నేడు
మధ్యాహ్నం 3.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో
ఎడ్జ్‌బాస్టన్‌ (ఇంగ్లాండ్‌)

గత రెండేండ్లుగా టీ20 ఫార్మాట్‌లో తిరుగులేని విజయాలు సాధించిన భారత్‌ ఐసీసీ ప్రపంచకప్‌ విజయానంతరం వరుసగా ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌కు సిరీస్‌ కోల్పోయింది. వన్డే ఫార్మాట్‌లో గత ఆరు ద్వైపాక్షిక సిరీస్‌ల్లో భారత్‌ మూడింట ఓడింది. విదేశీ గడ్డపై శ్రీలంక, ఆస్ర్టేలియా చేతిలో, స్వదేశంలో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి పాలైంది. అయినా, ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ మరో 15 నెలల్లో ఉండటంతో అన్ని జట్ల ఫోకస్‌ 50 ఓవర్ల ఫార్మాట్‌పై పడింది. టీ20లో యువ జట్టు పరిస్థితులకు అలవాటు పడేందుకు ఇబ్బంది పడగా.. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లికి తోడు జశ్‌ప్రీత్‌ బుమ్రా సైతం రావటంతో వన్డే జట్టులో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కివీస్ చేతిలో టెస్టు సిరీస్‌ ఓడిన ఇంగ్లాండ్‌.. భారత్‌పై టీ20 సిరీస్‌ విజయంతో ఉత్సాహంగా కనిపిస్తోంది. మూడు వన్డేల సిరీస్‌లోనైనా భారత ఆటగాళ్లు ఇక్కడి పరిస్థితులకు తగినట్టుగా ఆడతారా? లేదంటే టీ20 బ్యాటర్ల బాటలో నడుస్తారా? అనేది చూడాలి. భారత్‌, ఇంగ్లాండ్‌ తొలి వన్డే నేడు ఎడ్జ్‌బాస్టన్‌లో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఆరంభం.
ఉత్సాహంగా భారత్‌ :
విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, జశ్‌ప్రీత్‌ బుమ్రాకు తోడు శుభ్‌మన్‌ గిల్‌, కెఎల్‌ రాహుల్‌ రాకతో వన్డే జట్టు బలోపేతంగా కనిపిస్తోంది. విరామం తర్వాత నేరుగా ఇంగ్లాండ్‌కు చేరుకున్న క్రికెటర్లు ఇక్కడి పరిస్థితులకు వేగంగా అలవాటు పడతారా? లేదా అనేది అతిపెద్ద సవాల్‌గా మారింది. వైట్‌బాల్‌ ఫార్మాట్లో ఈ నలుగురికి ఇంగ్లాండ్‌లో మంచి గణాంకాలు ఉన్నాయి. బ్యాట్‌తో కోహ్లి, రోహిత్‌, శుభ్‌మన్‌, రాహుల్‌ మెరిస్తే భారత్‌కు ఇబ్బంది ఉండదు. బుమ్రా జట్టులోకి వచ్చినా అతడికి మరో ఎండ్‌ నుంచి మహ్మద్‌ సిరాజ్‌ సహకారం ఉండదు. అర్ష్‌దీప్‌ సింగ్‌ ఇక్కడ తడబాటకు గురవుతున్నాడు. దీంతో బుమ్రాపైనే బౌలింగ్‌ భారం పడనుంది. పేస్‌ ఆల్‌రౌండర్లు హార్దిక్‌ పాండ్య, నితీశ్‌ కుమార్‌ రెడ్డి లేని వేళ జట్టు సమతూకం ఎలా సాధ్యపడుతుందో చూడాలి. మూడో పేసర్‌ గుర్నర్‌ బరార్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కుల్‌దీప్‌ యాదవ్‌ స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా ఆడనుండగా.. ఆల్‌రౌండర్‌ స్థానం కోసం శివమ్‌ దూబె, వాషింగ్టన్‌ సుందర్‌ పోటీపడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -