టీజీ20 లీగ్‌పై టీసీఏ సెక్రటరీ గురువారెడ్డి విమర్శ
నవతెలంగాణ-హైదరాబాద్ :
తెలంగాణ జిల్లాల క్రికెట్‌కు ప్రత్యేక అసోసియేషన్ ఏర్పాటుపై బాంబే హైకోర్టులో కేసు నడుస్తుండగా హెచ్‌సీఏ టీజీ20 పేరిట లీగ్ ఏ విధంగా నిర్వహిస్తుందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) ప్రధాన కార్యదర్శి ధరమ్ గురువారెడ్డి ప్రశ్నించారు. టీజీ20 లీగ్ నిర్వహణతో వాణిజ్య ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) జిల్లాల క్రికెటర్ల ప్రాతినిథ్యం, జిల్లాలో క్రికెట్ అభివృద్దిని పూర్తిగా విస్మరించిందని గురువారెడ్డి విమర్శించారు. ‘టీసీఏతో రిజిస్టర్ చేసుకున్న తెలంగాణ జిల్లాల్ల క్రికెటర్లను టీజీ20 సెలక్షన్స్‌కు పరిగణలోకి తీసుకోలేదు. కొంత మంది కోచ్‌లు తమ అకాడమీలకు చెందిన క్రికెటర్లు మాత్రమే లీగ్‌లో ఆడేలా సెలక్షన్ ప్రక్రియను ప్రభావితం చేశారు. దీంతో ప్రతిభావంతులైన తెలంగాణ క్రికెటర్లకు తీరని అన్యాయం జరిగింది. ఈ విషయంపై ఎంతో మంది క్రికెటర్లు టీసీఏకు ఫిర్యాదు చేశారు. హెచ్‌సీఏ ఈ అంశంలో ఎటువంటి పారదర్శత పాటించటం లేదు. లీగ్ ముగియకుముందే రూ.15 కోట్ల నష్టమని ప్రకటన చేయటం ఆర్థిక లావాదేవీలు, స్వతంత్ర ఆడిట్ అవసరాన్ని గుర్తు చేస్తుంది. లీగ్‌లో 160 మంది క్రికెటర్లకు గాను జిల్లాల నుంచి కేవలం 32 మంది మాత్రమే ఉన్నారు. హెచ్‌సీఏలో జిల్లా క్రికెటర్లపై వివక్షకు ఇదే నిదర్శమని’ గురువారెడ్డి అన్నారు. ఓపెన్ ట్రయల్స్‌లో ఎంపిక విధానంపై టీసీఏ సహా క్రికెటర్లు ఫిర్యాదు చేసిన హెచ్‌సీఏ పట్టించుకోవటం లేదు. సెలక్షన్స్, కొందరు కోచ్‌ల విరుద్ధ ప్రయోజనాలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
వాణిజ్య ప్రయోజనాలకే ప్రాధాన్యత
- Advertisement -
- Advertisement -



