– వన్డే ప్రపంచ కప్‌కు ఆఫ్ఘన్ జట్టు ఇదే!
కాబూల్: భారత్ వేదికగా జరగనున్న ఐసిసి వన్డే ప్రపంచకప్‌కు ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఆ దేశ క్రికెట్‌బోర్డు ప్రకటించింది. హష్మతుల్లా షాహిదీ కెప్టెన్‌గా ఎంపికవ్వగా.. పేసర్ నవీనుల్ హక్‌కు రెండేళ్ల తర్వాత ఆఫ్ఘన్ జట్టులో చోటు దక్కింది. ఇక ఆసియా కప్‌లో రాణించిన గుల్బాదిన్ నైబ్‌కు ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కలేదు. మాజీ కెప్టెన్ కరీం జనత్, షరాఫుద్దీన్ అష్రఫ్, సులిమాన్ సఫీలకు కూడా నిరాశే ఎదురైంది. ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు తన తొలి మ్యాచ్ అక్టోబర్ 7న బంగ్లాదేశ్‌తో ఆడనుంది. జట్టు: హష్మతుల్లా(కెప్టెన్), గుర్బాజ్, జడ్రాన్, రియాజ్ హసన్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, ఇక్రమ్ అలీఖిల్, అజ్మతుల్లా ఒమర్జారు, రషీద్ ఖాన్, ముజిబుర్, నూర్ అహ్మద్, ఫజల్ హక్వీన్, ఫజల్ ఫారూఖీ.